PM Modi : మోర్పి ఘటన స్థలానికి పీఎం మోదీ
నవంబర్ 1న పర్యటించనున్న ప్రధాని
PM Modi : ఓ వైపు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో చోటు చేసుకున్న ఘోరమైన విషాదం మరిచి పోక ముందే మరో దారుణమైన ఘటన భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మోర్పీ బ్రిడ్జిపై ఛత్ పూజ కోసం బయలు దేరిన 500 మంది ఒక్కసారిగా వంతెనపై నిల్చుని ఉండి పోయారు.
దీంతో దాని సామర్త్యం తగ్గడం, పూర్తిగా ఉపయోగలోంకి రాక పోవడంతో దానిని పునర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడు నెలలుగా దానిని మూసి వేసింది. అయితే ప్రతి ఏటా అక్టోబర్ మాసంలో నూతన సంవత్సరాన్ని జరుపు కోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.
ఈసారి ఛత్ పూజ కోసం వందలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. వంతెనపై నిల్చోవడంతో ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఇటీవలే తిరిగి తెరవడంతో భారీగా తరలి రావడం, నిమిషాల్లోనే వంతెన కూలి పోవడంతో పడి పోయారు. చాలా మంది చెల్లా చెదురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ దళాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే గుజరాత్ లోనే పర్యటిస్తున్నారు ప్రధాన మంత్రి మోదీ(PM Modi). ఆయన మోర్పీ ఘటన స్థలాన్ని మంగళవారం సందర్శిస్తారు. ఈ మేరకు ఘటనా స్థలంతో పాటు బాధిత కుటుంబాలను కూడా మోదీ పరామర్శించనున్నారు.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి సాయం ప్రకటించాయి. రష్యా, తదితర దేశాల అధిపతులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : ఘటన బాధాకరం రాజకీయం చేయం