Vikas Raj : దేశ వ్యాప్తంగా ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తెలంగాణలోని మునుగోడు నియోకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆపై భారతీయ జనతా పార్టీ లోకి జంప్ అయ్యారు.
ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీని ప్రకటించింది. ఇప్పటికే ప్రచారం పోటా పోటీగా చేస్తున్నాయి పార్టీలు. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్(Vikas Raj) . మునుగోడులో మొత్తం 2 లక్షల 41 వేల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
సోమవారం వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదని పేర్కొన్నారు. 3న జరిగే పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రారంభం అవుతుందని సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు వికాస్ రాజ్.
పట్టణ ప్రాంతాల్లో 35, గ్రామీణ ప్రాంతాల్లో 263 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక నియోజకవర్గంలో మొత్తం 5,686 బ్యాలట్ ఓట్లు ఉన్నాయని కానీ 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా గంట ముందు చేరుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆర్ఓను తొలగించింది. ఇక మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు పంపింది.
Also Read : మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు