Rahul Gandhi : భారత దేశ ప్రధాన మంత్రి , దివంగత ఇందిరా గాంధీ వర్దంతి ఇవాళ. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణలో ఉన్నారు. ఆయన చేపట్టిన యాత్ర సోమవారం శంషాబాద్ మీదుగా హైదరాబాద్ కు చేరుకుంది.
తాను నాయనమ్మ ఇందిరా గాంధీ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఆమె మా నుంచి దూరమై కొన్నేళ్లు అయినా ఇప్పటికీ మా గుండెల్లో కదలాడుతూనే ఉంటుందని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో భావోద్వేగానికి లోనయ్యారు. భారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ చరిత్ర సృష్టించారు.
అంతే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలళ్లలో ఇందిరా గాంధీ నిలిచి పోయారు. ఇప్పటికీ లక్షలాది మంది ఆమెను ఇండియా ఇందిర ఇందిర ఇండియా అని కూడా పిలుచుకుంటారు. రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
కానీ ఆమె హయాంలోనే పార్టీ తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయం ఒకింత మచ్చ తెచ్చేలా చేసింది. అంగరక్షకుల చేతుల్లోనే ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తనయుడు రాజీవ్ గాంధీ(Rahul Gandhi) దారుణ చావుకు లోనయ్యారు. ఎల్టీటీఈ అతడిని పొట్టన పెట్టుకుంది. నిందితులకు గాంధీ కుటుంబం క్షమాభిక్షను ప్రసాదించింది.
ఈ తరుణంలో నాయనమ్మ లేని జీవితం ఒక శూన్యంగా ఉందని తలుచుకున్నారు రాహుల్ గాంధీ. ఈ అఖండ భారతాన్ని ఛిన్నాభిన్నం చేయనీయను అంటూ పేర్కొన్నారు.
Also Read : మోర్పి ఘటన స్థలానికి పీఎం మోదీ