Supreme Court CAA : సీఏఏ న్యాయ ప‌రిధిలోకి రాదు – కేంద్రం

సుప్రీంకోర్టుకు అఫిడ‌విట్ లో స్ప‌ష్టం

Supreme Court CAA : ఒకే దేశం ఒకే జాతి ఒకే మ‌తం ఒకే భాష ఒకే పార్టీ ఉండాల‌న్న‌ది భార‌తీయ జ‌న‌తా పార్టీ ల‌క్ష్యం. రెండోసారి మోదీ నేతృత్వంలో కొలువుతీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఎలాగైనా స‌రే సీఏఏ ను తీసుకు రావాల‌ని చూస్తోంది. 232 పిటిష‌న్లు ఈ ఒక్క దానిని స‌వాల్ చేస్తూ భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానంలో దాఖ‌ల‌య్యాయి దావాలు.

ఇందుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో పౌర స‌త్వానికి సంబంధించి న్యాయ ప‌రిధిలోకి(Supreme Court CAA) రాద‌ని స్ప‌ష్టం చేసింది. పార్ల‌మెంట్ లో చ‌ట్టం చేశాక దానిని ప్ర‌శ్నించే అధికారం కోర్టుకు ఉండ‌ద‌ని కానీ వ్యాఖ్యానించేందుకు అవ‌కాశం మాత్రం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

దీనిపై కేంద్రం పూర్తిగా క్లారిటీతో ఉంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నాయి. పార్టీలు, ప్ర‌తిపక్షాలు, సంఘాలు, పౌర , ప్ర‌జా సంఘాల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 31, 2014న లేదా అంత‌కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఆఫ్గ‌నిస్తాన్ ల‌లో మ‌త ప‌ర‌మైన హింస కార‌ణంగా దేశానికి వ‌చ్చిన ముస్లిమేత‌ర శ‌ర‌ణార్థుల‌కు పౌర‌స‌త్వం మంజూరు చేయాల‌ని అనుకుంది.

సీఏఏ నిబంధ‌న‌ల‌ను స‌వాల్ చేసింది. 2019 పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ) చ‌ట్ట బ‌ద్ద‌త న్యాయ స‌మీక్ష ప‌రిధిలోకి రాద‌ని ఎందుకంటే పౌర‌స‌త్వం , విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలు పూర్తిగా పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం కోర్టుకు తెలిపింది.

ప్ర‌స్తుతం కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుపోయే ప‌నిలో ప‌డింద‌న్న‌ది వాస్త‌వం.

Also Read : మునుగోడులో 298 పోలింగ్ కేంద్రాలు

Leave A Reply

Your Email Id will not be published!