DAV Public School Reopen : డీఏవీ పబ్లిక్ స్కూల్ పునః ప్రారంభం
పేరెంట్స్ ఆందోళనకు తలొగ్గిన సర్కార్
DAV Public School Reopen : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ డీఏఈ పబ్లిక్ లో చోటు చేసుకున్న చిన్నారి అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూల్స్ లలో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. దీనిని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు పేరెంట్స్. తమ పిల్లలకు పరీక్షలు చేయాలని, ప్రిన్సిపాల్, డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించింది. ఈ మేరకు సమావేశమైన మంత్రి తలొగ్గారు. ఎట్టకేలకు డీఏవీ స్కూల్ పునః ప్రారంభానికి సుముఖత వ్యక్తం చేశారు(DAV Public School Reopen). ప్రభుత్వం ఒప్పుకుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నవంబర్ 2 నుంచి డీఏవీ స్కూల్ రీ ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీనిపై విద్యా శాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పిల్లల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ప్రభుత్వం పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.
పాఠశాలలో సీసీ కెమెరాలతో పాటు పూర్తి రక్షణ కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు. వేరే పాఠశాలకు బదిలీ చేయడం వల్ల తమపై ఆర్థిక భారం పడుతుందన్నారు.
Also Read : మునుగోడులో 298 పోలింగ్ కేంద్రాలు