TTD EO : శ్రీ‌వారి బ్రేక్ ద‌ర్శ‌నంలో కీల‌క మార్పు – ఈవో

డిసెంబ‌ర్ 1 నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు

TTD EO : రోజు రోజుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకునే స‌మ‌యం మ‌రింత పెరుగుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా వ‌సతి సౌక‌ర్యాలు స‌రి పోవ‌డం లేదు. మ‌రో వైపు టికెట్ల వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగా మారింది.

ఇదే స‌మ‌యంలో వీఐపీల రాక కూడా ఇబ్బందిక‌రంగా మారింది. కోట్లాది రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూరుతోంది ప్ర‌తి రోజూ. ఒక్క త‌లనీలాలు, ప్ర‌సాదంతో పాటు భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. గ‌తంలో కంటే ఇప్పుడు లడ్డూ, అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌లో ఆశించినంత నాణ్య‌త ఉండ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఎంతో దూరం నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఇది ఇబ్బందిక‌రంగా మారింది. తాజాగా టీటీడీ స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్ల‌ను విడుద‌ల చేసింది. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక డిసెంబ‌ర్ 1 నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి బ్రేక్ ద‌ర్శ‌న స‌మ‌యంలో మార్పు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు(TTD EO).

క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ ఉండే భ‌క్తుల‌కు ఉద‌యం వేళ ద‌ర్శ‌నం చేయిస్తామ‌న్నారు. అనంత‌రం బ్రేక్ ద‌ర్శ‌నాన్ని ఉద‌యం 8 గంట‌ల‌కు మారుస్తున్న‌ట్లు చెప్పారు ఈవో. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు ఇవాల్టి నుంచి ఉచిత స‌ర్వ ద‌ర్శ‌నం టైం స్లాట్ టోకెన్ల జారీని పునః ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

రైల్వే స్టేష‌న్ వెనుక వైపు ఉన్న శ్రీ‌వారి స‌త్రం , శ్రీ‌నివాసం, భూదేవి కాంప్లెక్స్ ల‌లో స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేస్తామ‌న్నారు. శ‌ని, ఆది, సోమ‌, బుధ వారాల్లో 25 వేల టోకెన్లు, మంగ‌ళ‌, గురు, శుక్ర‌వారాల్లో 15 వేల టోకెన్లు భ‌క్తుల‌కు అందుబాటులోకి తెస్తామ‌న్నారు ధ‌ర్మారెడ్డి.

Also Read : బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న‌పై మోదీ కీల‌క‌ స‌మీక్ష

Leave A Reply

Your Email Id will not be published!