Akunuri Murali : ఆకునూరి మురళి రాజీనామాకు ఓకే
ఇక తెలంగాణలో సమస్యలపై పోరు
Akunuri Murali : తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి తన పదవికి రాజీనామా చేసిన ఆకునూరి మురళి సంచలనంగా మారారు. ఇదే సమయంలో ఆయన సేవలను సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి ఏపీకి తీసుకున్నారు.
ప్రధానంగా విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఆకునూరి మురళిని. ఆయన తన పదవీ కాలంలో పెను మార్పులు తీసుకు వచ్చారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీకి దేశంలోనే మంచి పేరు తీసుకు వచ్చేలా చేశారు.
నాడు నేను అనే కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆకునూరి మురళి(Akunuri Murali) . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తగిన రీతిలో గుర్తింపు కోల్పోయారు.
ప్రధానంగా బహుజన కులాలకు చెందిన ఐఏఎస్ లకు తీవ్రమైన అన్యాయం, వివక్ష కొనసాగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వ(AP Govt) సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. తాను ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఆకునూరి మురళి ఆమ్ ఆద్మీ పార్టీ లో లేదా బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Also Read : డీఏవీ పబ్లిక్ స్కూల్ పునః ప్రారంభం