Munugodu By Poll : మునుగోడులో ప్రచారం పరిసమాప్తం
నవంబర్ 3న ఎన్నికల పోలింగ్
Munugodu By Poll : మునుగోడు ఉప ఎన్నిక మంగళవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గంలో 2 లక్షల 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది.
ఏ మాత్రం రూల్స్ అతిక్రమించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. నవంబర్ 3న పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్(Munugodu By Poll) కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా ఆయా పార్టీలకు సంబంధించిన గుర్తింపు పొందిన ఏజెంట్లు పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఆయా పోలిగ్ కేంద్రాల (బూత్ లు) వద్దకు చేరుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు వికాస్ రాజ్.
బుద్ద భవన్ లోని ఎన్నికల కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా వెంటనే సరి చేసేందుకు ఎన్నికల కేంద్రం అధికారి పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
సోషల్ మీడియా ప్రచారంపై కూడా నిషేధం ఉంటుందన్నారు వికాస్ రాజ్. తనపై ఎలాంటి రాజకీయ వత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాము ఇచ్చిన నోటీసుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారని తెలిపారు.
ఇదిలా ఉండగా బీజేపీ, కాంగ్రెస్,టీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఇవాల్టితో ప్రచారం ముగియనుంది.
Also Read : ఆకునూరి మురళి రాజీనామాకు ఓకే