Taal Se Taal Mila Dance : తాల్ సే తాల్ మిలా రాహుల్ గాంధీ ఫిదా
తెలంగాణలో కొనసాగుతున్న పాదయాత్ర
Rahul Taal Se Taal Mila Dance : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. శంషాబాద్ మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్బంగా దారి పొడవునా రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారు.
మంగళవారం రాహుల్ గాంధీ పాదయాత్ర లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆమెకు భరోసా ఇచ్చారు.
తన కొడుకుకు జరిగిన అన్యాయం గురించి ఆమె వివరించారు. అనంతరం ఓ యువతి రహదారిపై ప్రముఖ పాపులర్ సాంగ్ తాల్ మూవీ లోని తాల్ సే తాల్ మిలా(Taal Se Taal Mila) పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఆ యువతి చేసిన డ్యాన్సుకు ఫిదా అయ్యారు రాహుల్ గాంధీ.
అనంతరం అద్భుతంగా చేసిందంటూ ప్రశంసలు కురిపించారు. మరో వైపు తమిళనాడులో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ముగిసింది. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. మొత్తానికి భారత్ జోడో యాత్ర కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు.
జయహో రాహుల్ గాంధీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరో వైపు మీడియాతో కీలకమైన ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు రాహుల్ గాంధీ. మొత్తంగా తాను పప్పు కాదని మిస్టర్ పర్ ఫెక్ట్ అని నిరూపించుకున్నారు.
Also Read : రాహుల్ యాత్రలో రోహిత్ వేముల తల్లి
Energy and elegance – traits of our traditional dance forms!#BharatJodoYatra pic.twitter.com/mONctDHIGS
— Bharat Jodo (@bharatjodo) November 1, 2022