IAM Not Parag Agrawal : మీరు వెతుకున్న పరాగ్ నేను కాదు
హైదరాబాద్ బ్యాంకర్ పరాగ్ అగర్వాల్
IAM Not Parag Agrawal : సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతూ వస్తున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ సిఇఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ అనుకోని రీతిలో వైదొలిగాడు. ఇందుకు ప్రధాన కారణం టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్. ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు చేజిక్కించుకున్న తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
టాప్ లెవల్లో ఉన్న సిఇఓ పరాగ్ అగర్వాల్ , సిఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దెలతో మరికొందరిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. భారీ ఎత్తున ధర పెరిగేందుకు సిఇఓ పరాగ్ అగర్వాల్ కారణమని మండిపడ్డారు ఎలాన్ మస్క్. ఈ తరుణంలో ఇప్పటి వరకు ట్విట్టర్ లో 7,500 మందికి పైగా పని చేస్తున్నారు.
ఈ రెండు మూడు రోజుల్లోనే 5 వేల మందికి పైగా తొలగించనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో సిఇఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ నుంచి వెళ్లి పోయాక ఆయన ప్రొఫైల్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. విచిత్రం ఏమిటంటే సోషల్ మీడియాలో పరాగ్ అగర్వాల్ పేరు మీద ఉన్న వారందరికీ లైక్స్ , కామెంట్స్ పెరగడం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
తాజాగా ట్విట్టర్, లింక్డ్ ఇన్ లో హైదరాబాద్ కు చెందిన బ్యాంకర్ పరాగ్ అగర్వాల్ చివరకు ట్రాఫిక్ ను తట్టుకోలేక తన ప్రొఫైల్ ను మార్చుకున్నట్లు తెలిపాడు. ఆయన క్యాప్షన్ ను కూడా జత చేశారు. తాను మీరు వెతుకుతున్న పరాగ్ అగర్వాల్ ను(IAM Not Parag Agrawal) కాదని స్పష్టం చేశాడు. మొత్తంగా పరాగ్ అగర్వాల్ ఈ రకంగా వింత అనుభవాన్ని పొందాడు.
Also Read : వ్యాపారవేత్త జంషెడ్ ఇరానీ ఇకలేరు