Arvind Kejriwal : భారీ అవినీతి వల్లే కూలిన వంతెన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో మోర్బీ వంతెన ఆదివారం సాయంత్రం కూలి పోయింది. ఈ ఘటనలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 177 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఓ వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. మంగళవారం బాధిత కుటుంబాలను పరామర్శించే పనిలో బిజీగా మారారు. త్వరలో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం ప్రకటించాయి. ఈ మొత్తం ఘటనకు ప్రధాన కారణం పాలకులు, అధికారులే కారణమని ఏకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
ఈనెల 14న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు. ఇది ఇలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. దీనికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరమ్మత్తుల కోసం నిలిపి వేసిన వంతెనను ఎందుకు తిరిగి ప్రారంభించాల్సి వచ్చిందని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్.
ఇదంతా భారీ అవినీతి చోటు చేసుకోవడం వల్ల కూలి పోయిందని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతున్నా. వంతెన నిర్మాణంలో అనుభవం లేని వాచ్ మేకింగ్ కంపెనీని ఎందుకు అనుమతించారంటూ నిలదీశారు ఢిల్లీ సీఎం(Arvind Kejriwal) .
మంగళవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఇంత భారీ ఎత్తున ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ గుజరాత్ సర్కార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలన్నారు కేజ్రీవాల్.
Also Read : 14న మోర్బీ వంతెన ప్రమాదంపై విచారణ