Koo Offer : ట్విట్టర్ యూజర్లకు ‘కూ’ ఖుష్ కబర్
ఎలాన్ మస్క్ దెబ్బకు పెను మార్పులు
Koo Offer : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కైవసం చేసుకున్నాక పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దె లకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆపై పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డడాడు మస్క్.
ట్విట్టర్ లో మొత్తం 7,500 మందికి పైగా పని చేస్తుండగా ఇప్పటి వరకు 80 శాతంకు పైగా ఎంప్లాయిస్ ను తొలగించాలని డిసైడ్ అయ్యాడు. ఈ తరుణంలో 2,000 మందితోనే పని చేయనుంది ట్విట్టర్. ఇదే సమయంలో ఇప్పటి వరకు ఉచితంగా సేవలు అందుకున్న టిక్ మార్క్ కలిగిన ట్విట్టర్ యూజర్లకు బిగ్ షాక్ ఇవ్వనున్నారు ఎలాన్ మస్క్.
ఈ మేరకు టిక్ యూజర్లు కంటిన్యూ కావాలని అనుకుంటే నెల వారీగా రుసుము చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు టెస్లా సిఇఓ. దీంతో పెద్ద ఎత్తున యూజర్లు ట్విట్టర్ ను వదిలి పెట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని భారతీయ మైక్రో బ్లాగింగ్ సంస్థ – కూ – ఖుష్ కబర్ చెప్పింది. ట్విట్టర్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఉచితంగా సేవలు అందజేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూ సంస్థ కో ఫౌండర్ , సిఇఓ అప్రమయే రాధాకృష్ణ. తక్షణం కూ యాప్(Koo Offer) లోకి మారండి అంటూ స్విచ్చ్ టు కూ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ రకంగా ట్విట్టర్ యూజర్లు కూ కు మారుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Also Read : వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్