Chennai Heavy Rain : ఎడతెగని వర్షం చెన్నై అతలాకుతలం
ఇద్దరు దుర్మరణం 7 జిల్లాల్లో బడులు బంద్
Chennai Heavy Rain : భారీ వర్షాల తాకిడికి తమిళనాడు తల్లడిల్లుతోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి చెన్నైలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు(Chennai Heavy Rain) కురుస్తాయని హెచ్చరించింది. వర్షాల కారణంగా 7 జిల్లాల్లో బడులు మూత పడ్డాయి.
చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట, తదితర జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక చెన్నై నగరంలో నిన్న ఉదయం 8.30 గంటల నుండి ఇవాళ బుధవారం ఉదయం 5.30 గంటల దాకా కురుస్తూనే ఉంది వర్షం. ఇప్పటి వరకు 126.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
గత 30 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. వర్షం కారణంగా చెన్నపట్టణం తో పాటు దాని శివార్లలోని అనేక ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. విద్యుదాఘతంతో ఒకరు మరణిస్తే మరొకరు గోడ కూలి ప్రాణాలు కోల్పోయారు.
ఇవాళ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ చెన్నై, చెంగల్ పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది ప్రభుత్వానికి. ఇప్పటికే వర్షాల కారణంగా సీఎం ఎంకే స్టాలిన్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం. ఎవరికి ఇబ్బంది తలెత్తినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు సీఎం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్.
Also Read : గూగుల్ క్రోమ్ యూజర్లు జర జాగ్రత్త