LET Commander Killed : రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ కాల్చివేత
పండిట్లు..వలసదారులే టార్గెట్
LET Commander Killed : జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకు పండిట్లు, వలసదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చిన లష్కరే తోయిబా కమాండర్ ముఖ్తార్ అహ్మద్ భట్ ను కాల్చి చంపాయి(LET Commander Killed) భారత భద్రతా బలగాలు. ముఖ్తార్ అహ్మద్ భట్ చాలా ఏళ్లుగా లష్కరే తోయిబా అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా ఉన్నాడు.
అప్పటి నుంచి పని చేస్తూ కీలకమైన కమాండర్ స్థాయి వరకు ఎదిగాడు. గత మే 12న పుల్వామాలో జమ్మూ కాశ్మీర్ సిబ్బంది రియాజ్ అహ్మద్ థోకర్ హత్యలో కమాండర్ ముఖ్తార్ అహ్మద్ భట్ ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మరో ఘటన చోటు చేసుకుంది.
అవంతి పోరాలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో పాకిస్తాన్ నిషేధిత లష్కరే తోయిబా కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన వారిలో భట్ తో పాటు సక్లైన్ ముస్తాక్ ఉన్నారు. మూడో ఉగ్రవాది ముష్పిక్ పాకిస్తాన్ నివాసి కావడం విశేషం.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు ఉగ్రవాదులు జాతీయ రహదారి చుట్టూ తీవ్రవాద దాడికి జరిపేందుకు ప్లాన్ చేశారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముందే వారి ప్లాన్ ను పసిగట్టి ఛేదించారు పోలీసులు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చాలా ఏళ్లుగా లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉంది.
పుల్వామా నివాసి అయిన ముఖ్తార్ అహ్మద్ భట్ ఏప్రిల్ 18న తన తండ్రి తరపు అత్త వద్దకు వెళ్లే నెపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆనాటి నుంచి కనిపించకుండా పోయాడు.
Also Read : జార్ఖండ్ సీఎంకు ఈడీ షాక్