Sachin Pilot : రాజ‌స్థాన్ లో అనిశ్చితికి తెర దించాలి

డిమాండ్ చేసిన అగ్ర నేత స‌చిన్ పైలట్

Sachin Pilot : రాజ‌స్థాన్ కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న అనిశ్చితికి స్వస్తి ప‌ల‌కాలంటూ డిమాండ్ చేశారు అగ్ర నేత స‌చిన్ పైల‌ట్. రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్ యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూ వ‌స్తోంది. ఈ త‌రుణంలో ఇటీవ‌ల జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆసక్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్ చీఫ్ బ‌రిలో మొద‌ట సోనియా గాంధీ సీఎం గెహ్లాట్ ను ఎంచుకున్నారు. కానీ ఆయ‌న సీఎం ప‌ద‌వితో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కూడా కొన‌సాగుతానంటూ స్ప‌ష్టం చేశారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయినా తాను సీఎంగా ఉంటానంటూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ మేర‌కు ఆయ‌న‌కు సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ధిక్కార స్వ‌రం వినిపించారు.

ఇప్ప‌టి పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే రాజ‌స్థాన్ కు వ‌చ్చినా వారు వెళ్ల‌లేదు. పైగా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుంది హై క‌మాండ్ . ఈ త‌రుణంలో సీఎం కావాల‌ని ప్ర‌య‌త్నం చేశారు సచిన్ పైల‌ట్(Sachin Pilot). కానీ రాజస్థాన్ లో కూడా సీఎంపై చ‌ర్య తీసుకుంటే పార్టీకి మ‌నుగ‌డ క‌ష్టం అవుతుంద‌ని ఆలోచించిన హైక‌మాండ్ మౌనంగా ఉండి పోయింది.

ఈ త‌రుణంలో స‌చిన్ పైల‌ట్ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోసారి ఆయ‌న అశోక్ గెహ్లాట్ శిబిరాన్ని ల‌క్ష్యంగా చేసుకున్నారు.ఈ మ‌ర‌కు క్ర‌మ శిక్ష‌ణా రాహిత్యానికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను డిమాండ్ చేశారు స‌చిన్ పైల‌ట్.

Also Read : రెసిస్టెన్స్ ఫ్రంట్ క‌మాండ‌ర్ కాల్చివేత‌

Leave A Reply

Your Email Id will not be published!