Owaisi CAA : సీఏఏపై ఓవైసీ సీరియస్ కామెంట్స్
చట్టాన్ని మతం తటస్థంగా చేయండి
Owaisi CAA : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే మతం ఒకే పౌరసత్వం ఒకే భాష ఒకే పార్టీ ఉండాలని కోరుకుంటోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో మెజారిటీ ఉండడంతో బీజేపీ తాను ఏది కావాలని అనుకుంటుందో దానిని అమలు చేసే పనిలో బిజీగా ఉంటోంది.
తాజాగా సీఏఏ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. పౌరసత్వ సమరణ చట్టం పై ఇప్పటికే తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 232కు పైగా పిటిషన్లు సీఏఏ అమలుకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు సుప్రంకోర్టులో దాఖలయ్యాయి.
వీటిలో ఎంఐఎం తరపున ఓవైసీ కూడా దావా దాఖలు చేశారు. ఇదిలా ఉండగా గుజరాత్ లోని రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రజలను విచారించి పౌరసత్వం ఇచ్చే హక్కును కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi CAA) . సీఏఏ అమలు కాలేదు.
ఇప్పటి వరకు రూల్స్ ప్రతిపాదించ లేదు. చట్టంగా రాలేదు. అంతలోపు ఎలా అధికారాలు కల్పిస్తారంటూ ప్రశ్నించారు ఓవైసీ. గుజరాత్ లోకి ప్రవేశించిన ఆరు వర్గాల వలసదారులకు పౌరసత్వం మంజూరు చేసేందుకు ఆ రాష్ట్రంలోని రెండు జిల్లాల కలెక్టర్లకు పవర్స్ ను బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేశారు ఎంపీ.
Also Read : రాహుల్ యాత్రకు జనం బ్రహ్మరథం