Priyanka Chaturvedi : దైవ నిర్ణ‌యం కాదు పాల‌కుల పాపం

మోర్బీ బ్రిడ్జి కూల్చివేత‌పై ప్రియాంక

Priyanka Chaturvedi : గుజ‌రాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న‌లో 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంద‌ర్శించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌కు పూర్తి బాధ్య‌త వ‌హించాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించారు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది(Priyanka Chaturvedi) . పాల‌కుల నిర్ల‌క్ష్యం, అవినీతి చోటు చేసుకోవ‌డం వ‌ల్ల‌నే వంతెన కూలి పోయింద‌ని ఆరోపించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం ఎంపీ స్పందించారు. ఈ భారీ విషాదాక‌ర‌మైన ఘ‌ట‌న‌ను దేవుని మీద‌కు నెట్టి వేసేందుకు ప్ర‌ధాని మోదీ ఆయ‌న ప‌రివారం, బీజేపీ, కాషాయ సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయంటూ ఆరోపించారు.

ఇది ముమ్మాటికీ పాల‌కుల నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యమేనంటూ మండిప‌డ్డారు ప్రియాంక చ‌తుర్వేది. మోర్బీ దుర్ఘ‌ట‌న ఉద్దేశ పూర్వ‌క‌మైన మోసమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా బ్రిడ్జి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఒరెవా కంపెనీ మేనేజ‌ర్ల‌లో ఒక‌రైన దీప‌క్ ప‌రేఖ్ ను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ దురదృష్ట‌క‌ర సంఘ‌ట‌న త‌మ‌ది కాద‌ని దైవ నిర్ణ‌యం వ‌ల్ల జ‌రిగిందంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. దీనికి పూర్తిగా ఒరెవా కంపెనీతో పాటు ప్ర‌స్తుత బీజేపీ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది డిమాండ్ చేశారు.

ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందించిన తీరు స‌రిగా లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ. ఈ మొత్తం ఘ‌ట‌న‌పై సిట్టింగ్ సుప్రీం జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు.

Also Read : పీఎం మోదీకి స‌మ‌న్లు ఇవ్వాలి – సోరేన్

Leave A Reply

Your Email Id will not be published!