Editors Gulid : ది వైర్ ఎడిటర్ల ఇళ్ల సోదాలు దారుణం
అభ్యంతరం వ్యక్తం చేసిన ఎడిటర్స్ గిల్డ్
Editors Gulid : ది వైర్ ఎడిటర్ల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులు అత్యంత దారుణంగా ఉన్నాయంటూ సీరియస్ కామెంట్స్ చేసింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. ఈ విషయంలో దాఖలైన అన్ని ఫిర్యాదులను దర్యాప్తు చేయడంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరింది. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి బెదిరింపు వ్యూహాలను ఉపయోగించ వద్దంటూ ఎడిటర్స్ గిల్డ్ పోలీసులను కోరింది.
పోలీసుల సోదాలు జరిపిన తీరు, సీజ్ చేసిన విధానం రాచరికంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొంది. పూర్తిగా ప్రచురణ, ప్రసార, డిజిటల్ మీడియా రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మండి పడింది. బుధవారం ఎడిటర్స్ గిల్ట్ కీలక ప్రకటన చేసింది. ది వైర్ ఎడిటర్ల ఇళ్ల సోదాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
వారి ఇళ్లతో పాటు ఆఫీసు, న్యూస్ రూమ్ లో ఢిల్లీ పోలీసులు సోదాలు,సీజ్ లు జరిపిన తీరు తమను చాలా కలవరానికి గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే చట్టాన్ని తాము చేతుల్లోకి తీసుకున్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించింది.
ఏదైనా ఉంటే దానికి వివరణ ఇచ్చు కోవాలి లేదా ది వైర్ యాజమాన్యం లేదా సంపాదకులతో చర్చించాలి. కాదని అనుకుంటే కోర్టుకు వెళ్లాలి. ఇలా ఎవరో ఏదో ఫిర్యాదు చేసినంత మాత్రాన దాడులు, సోదాలకు దిగుతారా అంటూ నిప్పులు చెరిగింది ఎడిటర్స్ గిల్డ్(Editors Gulid).
ఇదిలా ఉండగా ది వైర్ పై బీజేపీ కి చెందిన అమిత్ మాల్వియా ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సోదాలు చేపట్టారు.
Also Read : సీఏఏపై ఓవైసీ సీరియస్ కామెంట్స్