Arvind Kejriwal : ఎల్జీ అడ్డుకున్నా యోగా క్లాసుల ప‌థ‌కం ఆగ‌దు

భిక్ష‌మెత్తి అయినా ప‌థ‌కం కొన‌సాగిస్తా

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఢిల్లీ ప్ర‌భుత్వం ఉచితంగా యోగా క్లాసుల ప‌థ‌కం అమ‌లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు సీఎం.

ఇంటింటికీ వెళ‌తా భిక్ష‌మెత్తుతా ఉచిత యోగా క్లాసులు ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం పేరు ఢిల్లీకి యోగ‌శాల ప‌థ‌కం అని నామ‌క‌ర‌ణం చేశారు. క్లాసుల కొనసాగింపు విష‌యంపై సీఎం, ఎల్జీల మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లకు ఉచితంగా అందించే దీనిపై అభ్యంత‌రం తెల‌ప‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు.

దీనికి ఎలాంటి ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ , భార‌తీయ జ‌న‌తా పార్టీలు అడ్డు ప‌డినా యోగా క్లాసుల ప‌థ‌కం ఆగ‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఢిల్లీలో త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు, చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆపేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కావాల‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోందంటూ మండిప‌డ్డారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 31 త‌ర్వాత యోగా ప‌థ‌కం కొన‌సాగింపున‌కు సంబంధించి ఎల్జీ గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలియ చేయ‌లేద‌న్నారు. అది ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలి వేస్తున్నామ‌ని పేర్కొన్నారు సీఎం.

ఇదిలా ఉండ‌గా అస‌లు దీనికి సంబంధించి ఢిల్లీ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఫైలు త‌మ‌కు అంద‌లేద‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌చివాల‌య వ‌ర్గాలు వెల్ల‌డించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలో 17 వేల మందికి పైగా ఉచిత యోగా త‌ర‌గ‌తుల‌తో ల‌బ్ది పొందుతున్నార‌ని సీఎం తెలిపారు.

Also Read : ది వైర్ ఎడిట‌ర్ల ఇళ్ల సోదాలు దారుణం

Leave A Reply

Your Email Id will not be published!