Twitter Blue Tick : బ్లూ టిక్ కావాలంటే ఫీజు చెల్లించాల్సిందే
తప్పనిసరిగా కట్టాల్సిందేనని స్పష్టం
Twitter Blue Tick : ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేసిన టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ బుధవారం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్విట్టర్ లో యూజర్లు బ్లూ టిక్ కలిగి ఉండాలంటే ప్రతి నెలా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ట్విట్టర్ ను పూర్తిగా కమర్షియల్ వైపు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇందులో భాగంగానే కీలక, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ హోరెత్తిస్తున్నారు. ఉద్యోగాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక నుంచి బ్లూ టిక్(Twitter Blue Tick) కలిగి ఉండాలంటే తప్పనిసరిగా $20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి.
దీనిపై స్పందించారు ఎలాన్ మస్క్. టిక్ మార్క్ ఉండాలంటే నెలకు $8 డాలర్లు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. బ్లూ టిక్ కోసం నెలవారీ రుసుము వసూలు చేయడాన్ని ఎలోన్ మస్క్ ప్రజలకు శక్తిగా అభివర్ణించారు. ఈ టిక్ మార్క్ కలిగిన వారికి అదనపు సౌకర్యాలు కలుగుతాయని, అందువల్ల చెల్లిస్తే తప్పేంటి అంటూ పేర్కొన్నారు ఎలాన్ మస్క్(Elon Musk).
ఫిర్యాదు చేయడం కొనసాగించండి. దానికి కొంత మేరకు ఖర్చవుతుందంటూ స్పష్టం చేశాడు ట్విట్టర్ బాస్. ఎవరైనా ఒకరి పేరుపై ఖాతా తెరవచ్చు. రుసుము చెల్లించి ధ్రువీకరించవచ్చని పేర్కొన్నారు.
బ్లూ టిక్ కోసం రుసుమును ప్రవేశ పెట్టడం అనేది మైక్రో బ్లాగింగ్ సైట్ లో మొదటి పెద్ద మార్పు. తనను తాను ట్విట్టర్ ఫిర్యాదు హాట్ లైన్ ఆపరేటర్ గా అభివర్ణించు కుంటున్నారు ఎలాన్ మస్క్.
Also Read : ట్విట్టర్ యూజర్లకు ‘కూ’ ఖుష్ కబర్