Digvijay Singh : భార‌త్ జోడో యాత్ర‌లో నా ఫోటో వ‌ద్దు

పీసీసీ చీఫ్ కు దిగ్విజ‌య్ సింగ్ లేఖ

Digvijay Singh : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు దిగ్విజ‌య్ సింగ్(Digvijay Singh) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న పీసీసీ చీఫ్ కు లేఖ రాశారు. భార‌త్ జోడో యాత్ర‌లో త‌న ఫోటో పెట్టొద్దంటూ కోరారు. దిగ్విజ‌య్ సింగ్ చేసిన ఈ అభ్య‌ర్థ‌న క‌ల‌క‌లం రేపుతోంది పార్టీలో. ఈ మేర‌కు మ‌ధ్య ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ కు లేఖ రాశారు.

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా ప్ర‌చార సామాగ్రిలో త‌న ఫోటో ఉండకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ మేర‌కు లేఖ రాసిన‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్దం చేస్తున్న ప్ర‌చార సామాగ్రిలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, భార‌త్ జోడో యాత్ర చేప‌డుతున్న రాహుల్ గాంధీ, ప్ర‌స్తుత పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఫోటోలు మాత్ర‌మే ఉండాల‌ని సూచించారు.

దిగ్విజ‌య్ సింగ్ అక్టోబ‌ర్ 22న ఈ లేఖ రాశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ గా మారింది. కాగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. అనంత‌రం న‌వంబ‌ర్ 7న మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతుంది. అక్క‌డి నుంచి మ‌ధ్య ప్ర‌దేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది.

కాగా 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా త‌న చిత్రాల‌ను ఉప‌యోగించ వ‌ద్ద‌ని దిగ్విజ‌య్ సింగ్(Digvijay Singh) కోరారు. సింగ్ రాసిన లేఖ‌పై స్పందించారు బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రజ‌నీష్ అగ‌ర్వాల్. ఆయ‌న త‌న ఫోటోను పెట్టుకునేందుకు భ‌య‌ప‌డుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

Also Read : ఎల్జీ అడ్డుకున్నా యోగా క్లాసుల ప‌థ‌కం ఆగ‌దు

Leave A Reply

Your Email Id will not be published!