Assembly By Polls 2022 : ఆరు రాష్ట్రాల‌లో ఉప ఎన్నిక‌ల పోలింగ్

ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభం

Assembly By Polls 2022 : దేశంలోని ఆరు రాష్ట్రాల‌లో ఉప ఎన్నిక‌లు(Assembly By Polls 2022) స‌జావుగా కొన‌సాగుతున్నాయి. ఉద‌యం 7 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఓటు వేసేందుకు అనుమ‌తి ఇచ్చాయి ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల సంఘాలు. ఇదిలా ఉండ‌గా గురువారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది.

పోలింగ్ కు సంబంధించి ఆదివారం కౌంటింగ్ స్టార్ట్ కానుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ , మొకామా అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. బీజేపీతో పొత్తు వీడాక జేడీయూ, ఆర్జేడీకి కీల‌కం కానుంది. ఇక బీహార్ తో పాటు హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌, యూపీ, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇవాళ పోలింగ్ ప్రారంభ‌మైంది.

బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మ‌ర‌ణంతో గోపాల్ గంజ్ లో ఉప ఎన్నిక జ‌రుగుతోంది. మొకామాలో అనంత్ సింగ్, న‌ళినీ రాజ‌న్ సింగ్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. తెలంగాణ‌లోని మునుగోడులో హై టెన్ష‌న్ నెల‌కొంది. ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ మ‌ధ్యే పోటీ నెల‌కొంది. 2023లో ప‌వ‌ర్ లోకి రావాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

బీఆర్ఎస్ ఏర్పాటుతో స‌త్తా చాటాల‌ని టీఆర్ఎస్ య‌త్నిస్తోంది. రాహుల్ పాద‌యాత్ర‌తో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి స్ర‌వంతి రెడ్డికి ఓట్లు ప‌డే చాన్స్ ఉంది. ఇక ముంబై లోని అంథేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఉద్ద‌వ్ వ‌ర్గానికి చెందిన రుతుజా ల‌ట్కే ప్ర‌ధాన పోటీదారుగా ఉన్నారు.

షిండేకు ఈ ఉప ఎన్నిక అగ్నిప‌రీక్ష‌గా మారింది. మ‌రో వైపు కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస పార్టీని వీడి బీజేపీలో చేర‌డంతో హ‌ర్యానా లోని అడంపూర్ లో ఉప ఎన్నిక కొన‌సాగుతోంది. హిస్సార్ లో కూడా పోలింగ్ జ‌రుగుతోంది. యూపీలోని ల‌ఖింపూర్ ఖేరి జిల్లా లోని గోక‌ర్ నాథ్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఇక్క‌డ బీజేపీ, ఎస్పీ మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఒడిశా లోని ధామ్ నగ‌ర్ లో పోలింగ్ కొన‌సాగుతోంది.

Also Read : కేంద్రంపై మ‌రో యుద్దానికి సిద్దం – టికాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!