Vikas Raj : అదంతా అబ‌ద్దం మునుగోడు ప్ర‌శాంతం

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వికాస్ రాజ్

Vikas Raj : ఓ వైపు మునుగోడులో దాడులు, ప్ర‌తి దాడులు కొన‌సాగుతూ ఉంటే అంతా ప్ర‌శాంతంగా ఉందంటున్నారు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వికాస్ రాజ్. 119 కేంద్రాల‌లో 298 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, నాన్ లోక‌ల్స్ ఎవ‌రూ లేర‌ని స్ప‌ష్టం చేశారు. గురువారం వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు.

స్థానికేత‌రులు ఉన్న వార‌ని గుర్తించి బ‌య‌ట‌కు పంపించామ‌న్నారు. మ‌ర్రిగూడలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య చిన్న‌పాటి ఘర్ష‌ణ చోటు చేసుకుంద‌ని వారిని పోలీసులు బ‌య‌ట‌కు పంపించార‌ని చెప్పారు. వీరిలో స్థానికేత‌రులు ఉన్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశార‌ని తెలిపారు.

42 మందిని గుర్తించి వారిని మునుగోడు నుంచి పంపించి వేశామ‌ని చెప్పారు వికాస్ రాజ్(Vikas Raj) . ఓటు వేసేందుకు డ‌బ్బులు తీసుకోవడం ఇవ్వ‌డం నేర‌మ‌న్నారు. ఇలాంటిది ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ అని పేర్కొన్నారు. ఓట‌ర్లంతా త‌మ విలువైన ఓటు హ‌క్కు వినియోగించు కోవాల‌ని కోరారు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్. మొత్తం పోలింగ్ కేంద్రాల‌లో పోలింగ్ స‌జావుగానే కొన‌సాగుతుంద‌న్నారు.

మూడు చోట్ల మాత్ర‌మే ఈవీఎంలు మొరాయించామ‌ని , వెంట‌నే గుర్తించి కొత్త వాటిని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వికాస్ రాజ్ వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఉప ఎన్నిక‌కు సంబంధించి 28 ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని చెప్పారు. రెండు చోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.

కాగా కాంగ్రెస్ అభ్య‌ర్థి స్ర‌వంతి రెడ్డి ఫిర్యాదు చేసింద‌ని దానిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌న్నారు వికాస్ రాజ్. పోలింగ్ ప్ర‌క్రియ‌ను వెబ్ కాస్ట్ ద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు సిఇఓ.

Also Read : పార్టీ ఆఫీసుకు బండి సంజ‌య్ త‌ర‌లింపు

Leave A Reply

Your Email Id will not be published!