Hemant Soren : ద‌మ్ముంటే న‌న్ను అరెస్ట్ చేయండి – సోరేన్

కేంద్ర స‌ర్కార్ పై సీఎం సీరియ‌స్ కామెంట్స్

Hemant Soren : అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంలో త‌న‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ స‌మ‌న్లు పంపించ‌డంపై సీరియస్ గా స్పందించారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. ద‌మ్ముంటే తాను నేరం గ‌నుక చేసిన‌ట్లు భావిస్తే లేదా నిరూపిత‌మైతే వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని స‌వాల్ విసిరారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ ఆడుతున్న నాట‌క‌మ‌ని కొట్టి పారేశారు.

కొంద‌రికి కొంత కాలం మాత్ర‌మే ప‌వ‌ర్ ఉంటుంద‌ని ఆ త‌ర్వాత జ‌నం ఛీద‌రించే రోజు త‌ప్ప‌క వ‌స్తుంద‌న్నారు. న‌రేంద్ర మోదీ, అమిత్ షా వ్యూహాలు, కుట్ర‌లు ఇక్కడ సాగ‌వ‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని చూశారు. కానీ ప్ర‌జ‌లు ఒప్పు కోలేదు. మాకు పాలించ‌మ‌ని పూర్తి మెజారిటీ క‌ట్ట‌బెట్టారు.

మ‌రాఠాలో కూల్చిన‌ట్లుగానే జార్ఖండ్ లో స‌ర్కార్ ను కూల దోయాల‌ని చూశార‌ని కానీ ఆ ప్లాన్ ఆదిలోనే ఫెయిల్ అయ్యింద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయంగా ఎదుర్కోలేక కేంద్రం ఇలా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను అడ్డం పెట్టుకుని నాట‌కాలు ఆడుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. గురువారం హేమంత్ సోరేన్ మీడియాతో మాట్లాడారు.

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిన రోజున మ‌నీలాండ‌రింగ్ కేసులో త‌న‌కు ఈడీ స‌మ‌న్లు పంపింద‌న్నారు. ద‌మ్ముంటే చేవ వుంటే ఖ‌లేజా ఉంటే మోదీకి తాను స‌వాల్ విసురుతున్నాన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం(Hemant Soren). ఈడీ వ‌ద్ద ఎందుకు సెక్యూరిటీ పెంచారంటూ నిల‌దీశారు.

తూర్పు రాష్ట్రాన్ని జార్ఖండీలు మాత్ర‌మే ప‌రిపాలిస్తార‌ని బ‌య‌టి వ్య‌క్తులు కాద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. రాబోయే లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అడ్ర‌స్ లేకుండా పోతుంద‌న్నారు.

Also Read : ఎన్నిక‌ల షెడ్యూల్ పై ప‌క్షపాతం లేదు

Leave A Reply

Your Email Id will not be published!