Munugodu By Poll : మునుగోడులో ముగిసిన పోలింగ్
మూడు చోట్ల ఈవీఎంల మొరాయింపు
Munugodu By Poll : దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణలోని ఒక్క మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ముగిసింది(Munugodu By Poll). చాలా కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లంతా తమ విలువైన ఓటు హక్కు వినియోగించు కునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటి వరకు 80 శాతానికి దగ్గరగా ఓట్ల శాతం నమోదైంది. ఉప ఎన్నికలో 2 లక్షల 41 వేల 805 ఓటర్లకు గాను 2 లక్షల దాకా ఓటర్లు ఓటు వేసినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ప్రలోభాలు, దాడులు, ఘర్షణలు, కేసుల దాకా కొనసాగాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఫోకస్ పెట్టామన్నారు సిఇఓ. 119 కేంద్రాలలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 3 వేల మంది పోలీసులతో పాటు 20 కేంద్ర బలగాలను మోహరించారు.
చివరి వరకు ఎవరు ఎవరికి ఓట్లు వేశారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీలు తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొన్నా చివరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యే ఉండ బోతోంది.
ఇక ఎగ్జిట్ పోల్స్ పరంగా చూస్తే టీఆర్ఎస్ కు ఛాన్స్ ఉందంటూ పేర్కొన్నాయి. మరో వైపు టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. తాము గెలవబోతున్నామని చెప్పారు. రూ. 1,000 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపించారు.
Also Read : కాషాయం దేశానికి ప్రమాదం – కేసీఆర్