Hemant Soren : మేం దొంగలమా సంఘ వ్యతిరేకులమా – సోరేన్
సమన్లు జారీ చేయడంపై సీరియస్
Hemant Soren : మైనింగ్ అక్రమ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు పంపించడంపై సీరియస్ అయ్యారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. మేం దొంగలం కామని ప్రజా ప్రతినిధులమని, దేశం విడిచి ఎక్కడికీ వెళ్లలేదని ఈ సందర్భంగా మండిపడ్డారు సీఎం.
దేశంలో ఎనిమిది రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్రంలోని మోదీ, అమిత్ షాకు దక్కుతుందన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగా కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించు కుంటోందని హేమంత్ సోరేన్(Hemant Soren) ఆరోపించారు.
తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. సీఎం సమన్లను పట్టించుకోకుండా ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో నెల రోజుల కిందట జరగాల్సిన డ్యాన్స్ ఫెస్టి వల్ లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా హేమంత్ సోరేన్(Hemant Soren) మీడియాతో మాట్లాడారు. మేము దొంగలమా సంఘ వ్యతిరేకులమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
ఇవాళ సమన్లు జారీ చేసి 24 గంటల్లో హాజరు కావాలంటే ఎలా అని నిప్పులు చెరిగారు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. నాకు నెల రోజుల కిందటే జాతీయ గిరిజన నృత్యోత్సవానికి ఆహ్వానం అందిందని చెప్పారు. రాయ్ పూర్ కు బయలుదేరే ముందు హేమంత్ స ఓరేన్ తన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
నేరం చాలా తీవ్రమైనదే అయితే నన్ను నేరుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకు వెళ్లవచ్చన్నారు. తమకంటూ ఓ షెడ్యూల్ ఉందన్నారు. నవంబర్ 12 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read : బెంజిమిన్ నెతన్యాహుకు మోదీ కంగ్రాట్స్