Nitish Kumar Modi : ప్రచారం ఎక్కువ పని తక్కువ – నితీశ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదం మాత్రమే
Nitish Kumar Modi : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్(Nitish Kumar Modi) చేశారు. ప్రచారంపై ఉన్నంత శ్రద్ద పాలనపై లేదన్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకు దాని ఊసెత్తడం లేదని మండిపడ్డారు.
సమాజంలోని బలహీన వర్గాలను, ప్రధానంగా మైనార్టీలు, దళితులను ఉద్దరించేందుకు తన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అంటూ ఆరోపించారు నితీశ్ కుమార్.
పేద రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందంటూ ధ్వజమెత్తారు. రెండు నెలల కిందట 17 ఏళ్ల అనుబంధాన్ని భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు బీహార్ సీఎం. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి మహా ఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వచ్చానని చెప్పారు.
కానీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదంటూ పీఎం మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడుకోవడం వదిలేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ప్రచారం మాత్రం భారీగా చేసుకుంటున్నారు కానీ అసలు వాస్తవానికి చర్యలు తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు బీహార్ సీఎం.
సచివాలంలో 200 మంది ఉర్దూ అనువాదకు నితీశ్ కుమార్ నియామక పత్రాలను అందజేశారు. స్టెనోగ్రాఫర్లకు కూడా పర్మినెంట్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : మేం దొంగలమా సంఘ వ్యతిరేకులమా – సోరేన్