Kajal Aggarwal : అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు అందరు స్టార్ హీరో ల సరసన నటించి తన అంద చందాలతో, నటన తో, హవా భావాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది కాజల్ అగర్వాల్.
ఎంతో కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొన సాగిన కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది .
పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటించింది . ఆ తర్వాత కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) గర్భవతి కావడంతో కొన్ని సినిమాల నుండి తప్పుకుంది . కొన్ని రోజుల క్రితమే కాజల్ అగర్వాల్ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది .
కాజల్ అగర్వాల్ తన కుమారుడి కి నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకుంది. ఇలా గర్భవతి అయిన కారణంగా సినిమా లకు దూరం అయిన కాజల్ అగర్వాల్ తిరిగి మళ్లీ సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది .
కాజల్ సినిమాలకు దూరం అయినా సోషల్ మీడియా కు దగ్గరగానే ఉంది. నిత్యం తన అంధ చందాలను అభిమానులతో పంచుకుంటుంది. కాజల్ కు పెళ్లి అయినా హీరోయిన్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా హాట్ అందాలను అభిమానులతో పంచుకుంది కాజు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజెల్ అనుపమ పరమేశ్వరన్ అందాలు