G Kishan Reddy : రూ. 100 కోట్లు కాదు 100 పైసలకు పనికి రారు
ఆ ఎమ్మెల్యేలకు అంత సీన్ లేదు
G Kishan Reddy : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(G Kishan Reddy) సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నారు. శుక్రవారం జి.కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన కొడుకును సీఎం చేసేందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
కేసీఆర్ ను తెలంగాణ సమాజం పూర్తిగా నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి వేసే ప్రసక్తి లేదన్నారు. తమ పార్టీ 2023లో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోటీ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో డిసైడ్ చేస్తారని తాము కాదన్నారు.
ఆదివారం ఎవరికి పట్టం కడతారనేది తేలుతుందన్నారు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్ కు తమను విమర్శించే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy).
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను రూ. 100 కోట్లకు పెట్టి కొనేంత దద్దమ్మలం కామన్నారు.
ఆ నలుగురిలో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, గతంలో మాట్లాడిన దానికి మరికొంత సాగదీసి, మరికొంత బూతులు పెంచుతూ పోయాడే తప్పా ఆ వీడియోలో ఏమందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాత రికార్డును తిరగ రాశారని ఎద్దేవా చేశారు.
తన పదవిని తాను చులకన చేస్తూ మాట్లాడాడే తప్ప ఇంకేమీ విషయం లేదన్నారు. తమ పార్టీలోకి రావాలంటే ముందు రాజీనామా చేసి రావాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోంది.
ప్రజాస్వామ్యం ఇక్కడ లేనే లేదు. ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టేందుకు కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నది తెలంగాణ సమాజానికి తెలియదా అని ప్రశ్నించారు.
Also Read : 6న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్