TTD Assets : రూ. 15,938 కోట్ల డిపాజిట్లు..10,258 కిలోల ప‌సిడి

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆస్తులు ఇవిగో

TTD Assets : ప్రపంచంలోని ఆధ్యాత్మిక దేవాల‌యాలు, పుణ్య క్షేత్రాల‌లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్షేత్రంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువై ఉన్న దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌కు ఉన్న ఆస్తులు, ఆభ‌ర‌ణాలు , స్థ‌లాలు చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే.

శ‌నివారం య‌ధావిధిగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ధ‌ర్మా రెడ్డి ఫోన్ ఇన్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఇందులో భాగంగా భ‌క్తులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న సావ‌ధానంగా స‌మాధానం ఇచ్చారు. టీటీడీకి ఎన్ని ఆస్తులు(TTD Assets)  ఉన్నాయ‌ని, వాటి వివ‌రాలు తెలియ చేయాల‌ని ఓ భ‌క్తుడు కోరాడు.

ఇందుకు సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టారు ఈవో. స్వామి వారి పుణ్య‌క్షేత్రానికి సంబంధించి మొత్తం రూ. 15, 938 కోట్ల రూపాయ‌లు వివిధ బ్యాంకుల‌లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయ‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో మ‌రి భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, బంగారు ఆభ‌ర‌ణాల విష‌యంలో ఏకంగా స్వామి వారికి 10,258.37 కిలోల బంగారం బ్యాంకుల్లో నిల్వ రూపంలో ఉంద‌ని చెప్పారు ధ‌ర్మారెడ్డి.

2019 నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌దు రూపంలో, బంగారం రూపంలో స్వామి వారికి సంబంధించి భారీగా పెరిగాయ‌ని స్ప‌ష్టం చేశారు ధ‌ర్మారెడ్డి. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కొంద‌రు చేస్తున్న నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

ఈ డిపాజిట్ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌లో పెడుతుంద‌న్న ప్ర‌చారం శుద్ద అబ‌ద్ద‌మ‌న్నారు. స్వామి వారికి సంబంధించి ఏదైనా బ్యాంకుల్లో ఉంటుందే త‌ప్పా వేరే చోట ఉండ‌ద‌న్నారు. ఇది భ‌క్తులు గుర్తించాల‌ని కోరారు.

Also Read : శ్రీ‌వారి ద‌ర్శ‌నం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!