Akunuri Murali : మునుగోడు ఎన్నిక‌ల కౌంటింగ్ ఆపాలి – ముర‌ళి

విచ్చ‌ల‌విడిగా డ‌బ్బులు, మ‌ద్యం పంపిణీ

Akunuri Murali : మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌దవికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పూర్తి స్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న గ‌ళాన్ని వినిపిస్తున్నారు. శ‌నివారం ఆకునూరి ముర‌ళి(Akunuri Murali) ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మునుగోడులో లెక్కించ లేనంత డ‌బ్బులు, ఊహించ‌నంత మ‌ద్యంతో పాటు భారీ ఎత్తున ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌లోభాల‌కు గురి చేశాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన‌ట్లుగా రూ. 8 కోట్ల‌కు పైగా లెక్క‌కు రాని న‌గ‌దు ప‌ట్టుకున్నామ‌ర‌ని ఈ డబ్బులు ఎవ‌రి నుంచి , ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇంత విచ్చ‌ల‌విడిగా డ‌బ్బులు పంచుకుంటూ పోతే ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు.

డబ్బుల పంపిణీ, మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి సామాజిక మాధ్య‌మాల‌లో చాలా వ‌చ్చాయ‌న్నారు. వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈనెల 6న ఆదివారం న‌ల్ల‌గొండ‌లో జ‌రిగే మునుగోడు ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ ను వెంట‌నే నిలిపి వేయాల‌ని ఆకునూరి ముర‌ళి(Akunuri Murali) డిమాండ్ చేశారు.

ప్ర‌జాస్వామ్యంలో ఓటు అన్న‌ది ముఖ్య‌మ‌ని, దానిని అప‌హాస్యం పాలు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు మేలు కోవాల‌ని త‌మ భ‌విత‌వ్యాన్ని నిర్ణ‌యించేది ఓటు మాత్ర‌మేన‌ని పాల‌కులు కాద‌న్న స‌త్యం తెలుసు కోవాల‌ని కోరారు.

Also Read : శరూ. 15,938 కోట్ల డిపాజిట్లు..10,258 కిలోల ప‌సిడి

Leave A Reply

Your Email Id will not be published!