Munugodu By Poll : మునుగోడులో మొన‌గాడు ఎవ‌రో

ఓట్ల లెక్కింపు ప్రారంభం

Munugodu By Poll : దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల ఉప ఎన్నిక‌లు జ‌రిగినా తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌పైనే(Munugodu By Poll) ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఇప్ప‌టికే గంప గుత్త‌గా ఎగ్జిట్ పోల్స్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అభ్య‌ర్థి గెలుస్తాడంటూ జై కొట్టాయి.

కానీ ఒక్క మిష‌న్ చాణ‌క్య‌, ఐప్యాక్ స‌ర్వే సంస్థ‌లు మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌నీసం 3 వేల ఓట్ల తేడాతో గెలుపొందుతుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాయి.

ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ది. ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

అనంత‌రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బీజేపీ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి బ‌రిలో నిలిచారు. బీఎస్పీ నుంచి చారి తో పాటు ప‌లువురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు.

ఈ త‌రుణంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. బీజేపీ నుంచి ప్ర‌ముఖ నేత‌లు, రాష్ట్రానికి సంబంధించి ప్ర‌భుత్వ యంత్రాంగంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ప్ర‌జా ప్ర‌తినిధులు మునుగోడులోనే మ‌కాం వేశారు. భారీ ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ రూ. 8.25 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక రూ. 300 కోట్ల విలువ చేసే మ‌ద్యాన్ని స‌ర‌ఫరా చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా న‌వంబ‌ర్ 6 ఆదివారం మునుగోడు మొన‌గాడు ఎవ‌రో తేల‌నుంది.

మొత్తం 2,41,805 ఓట‌ర్లు ఉండ‌గా ఈసారి 2,03,000 ఓట్లు పోల్ కావ‌డం విశేషం. తాజాగా ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభ‌మైంది.

Also Read : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ

Leave A Reply

Your Email Id will not be published!