Elon Musk : నెల లోపు భారత్ లో ట్విట్టర్ బ్లూ – మస్క్
సంచలన ప్రకటన చేసిన ఎలాన్ మస్క్
Elon Musk : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక్క అంశం ట్విట్టర్ వ్యవహారం. రూ. 4,400 కోట్లతో టేకోవర్ చేసుకున్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతంకు పైగా ఉద్యోగులను సాగనంపారు. అందరికీ ఈమెయిల్స్ ద్వారా సమాచారం చేర వేశారు.
మొత్తం ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ట్విట్టర్ ప్రధాన కార్యాయాలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టాప్ ఎగ్జిక్యూటివ్ లతో పాటు ట్విట్టర్ బోర్డు డైరెక్టర్లను తొలగించారు. ఇక నుంచి ట్విట్టర్ కు కర్త కర్మ అన్నీ తానేనని తానే బాస్ అంటూ ప్రకటించారు ఎలాన్ మస్క్(Elon Musk).
తాజాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్క్ అనేది కీలకంగా మారింది. దీనికి ప్రతి నెలా ఎవరైనా టిక్ మార్క్ కావాలని అనుకుంటే $8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఎలాన్ మస్క్. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు ట్విట్టర్ బాస్. ట్విట్టర్ బ్లూ ఇండియాకు ఎప్పుడు వస్తుందన్న దానిపై క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతానికి కొత్త వెరిఫికేషన్ సిస్టమ్ తో కూడిన ట్విట్టర్ బ్లూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రేట్ బ్రిటన్ లోని ఐ ఫోన్ లలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఒక నెల లోపు భారత్ లో ప్రవేశ పెడతామని చెప్పారు ఎలాన్ మస్క్(Elon Musk).
బ్లూ టిక్ కావాలంటే తప్పనిసరిగా రుసుము చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు ట్విట్టర్ బాస్. అంతే కాకుండా ట్విట్టర్ ద్వారా ప్రకటనలు గుప్పించే సంస్థలకు, వ్యక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ఎలాన్ మస్క్ షాక్ ఉద్యోగులకు ఝలక్