Munugodu Counting : ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

2,904 ఓట్ల లీడ్ లో ప్ర‌భాకర్ రెడ్డి

Munugodu Counting : దేశ వ్యాప్తంగా కీల‌కంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్ అభ్య‌ర్థుల మ‌ధ్య కొన‌సాగుతూ వ‌స్తోంది. మొద‌టి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే రెండు, మూడు రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో కొన‌సాగింది. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదో రౌండ్ల కౌంటింగ్ పూర్త‌య్యింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 2,04 ఓట్ల మెజారిటీ సాధించారు. ఏడు రౌండ్ లో టీఆర్ఎస్ కు 45, 723 ఓట్లు రాగా బీజేపీకి 43,151 ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి 12,025 ఓట్లు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో ఎనిమిదో రెండు ముగిసే స‌రికి ఆధిక్యం కొన‌సాగింది(Munugodu Counting) . ఈ రౌండ్ పూర్త‌య్యే స‌రికి గులాబీ పార్టీ అభ్య‌ర్థికి 52,243 ఓట్లు పోల్ అయ్యాయి.

బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కి 49,339 ఓట్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కేంద్రం వ‌ద్ద కౌంటింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం 9వ రౌండ్ కౌంటింగ్ ప్ర‌క్రియ కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి రెడ్డికి 13, 689 ఓట్లు పోల్ అయ్యాయి.

అంత‌కు ముందు ఆరో రౌండ్ లో బీజేపీకి 36,352 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 38,521 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ కు 12,025 ఓట్లు రాగా ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ 32,505 ఓట్లు రాగా బీజేపీకి 30,974 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ 10,063 ఓట్లు వ‌చ్చాయి. మొత్తంగా కౌంటింగ్ వ‌ద్ద 250 మంది ఏర్పాట్లలో నిమ‌గ్నం అయ్యారు.

100 మంది కౌంటింగ్ లో నిమ‌గ్నం కాగా 150 మంది ఇత‌ర ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నాయి.

Also Read : ఆరోప‌ణ‌లు అబ‌ద్దం కౌంటింగ్ ప్ర‌శాంతం

Leave A Reply

Your Email Id will not be published!