Uma Bharti : నన్ను దీదీ మా అని పిలవద్దు – ఉమా భారతి
సన్యాసం తీసుకుంటానని ప్రకటన
Uma Bharti : భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఉమా భారతి(Uma Bharti) సంచలన కామెంట్స్ చేశారు. నవంబర్ 17 నుండి అన్ని సంబంధాలను వదులు కుంటానని ఇప్పటికే ప్రకటించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తనను దీదీ మా అని పిలవకండి అని కోరారు ఉమా భారతి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను 1992లో సన్యాసం తీసుకున్నానని చెప్పారు.
ఆ సమయంలో తన పేరు ఉమా భారతి(Uma Bharti) నుంచి ఉమాశ్రీ భారతిగా మార్చారని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఆమె సీఎంగా పని చేశారు. ఉమాశ్రీ భారతిగా మార్చబడినప్పుడు సన్యాసం తీసుకున్నట్లు వెల్లడించారు.
30 ఏళ్లు అయిన సందర్భంగా బీజేపీ నాయకురాలు తన గురువు విద్యాసాగర్ జీ మహరాజ్ సలహా మేరకు దీదీ మా గా పిలవ బడుతుందన్నారు ఉమా భారతి. భారతి భారత దేశానికి చెందినదని అందిరి దీదీ గా మారండి అని స్వామీజీ తనకు బోధన చేశారని చెప్పారు.
ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను సన్యాసం తీసుకున్న సమయంలో ఆనాడు తాను ఎంపీగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అధికారికంగా మార్చలేమన్నారు. నా కుటుంబంతో పాటు నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ గా నిలిచారు. కష్ట కాలంలో అండగా ఉన్నారని తెలిపారు.
ఒక రకంగా విలువైన కాలాన్ని తాను కోల్పోయానని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాపై కేసులు మోపిందని అయినా తట్టుకుని నిలబడ్డానని చెప్పారు ఉమా భారతి. ప్రస్తుతం కుటుంబం నుంచి విముక్తి పొందానని పేర్కొన్నారు.
Also Read : మొకామాలో బీజేపీకి షాక్ ఆర్జేడీ విజయం