Gopalgunj By Poll BJP Win : గోపాల్ గంజ్ లో ‘క‌మ‌ల’ వికాసం

ఆర్జేడీకి కోలుకోలేని బిగ్ షాక్

Gopalgunj By Poll BJP Win : బీహార్ లో జ‌రిగిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల్లో ఒక స్థానాన్ని ఆర్జేడీ నిల‌బెట్టుకుంటే మ‌రో స్థానం కోల్పోయింది. ఒక ర‌కంగా ఆర్జేడీకి షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. మొకామా స్థానంలో స‌మీప బీజేపీ అభ్య‌ర్థిపై నీలం దేవి 16,000 ఓట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

ఇక గోపాల్ గంజ్ లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో సీటును కోల్పోయింది ఆర్జేడీ. కేవ‌లం 2,000 ఓట్లతో ఓడి పోవ‌డం షాక్ కు గురి చేసింది. సీఎం నితీశ్ కుమార్ బీజేపీని ప‌క్క‌న పెట్టి తేజ‌స్వి యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది నెల‌ల‌కే బీహార్ లోని అధికార కూట‌మి బీజేపీతో ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగిన పోరులో మ‌రో సీటులో ఓడి పోయింది.

గోపాల్ గంజ్ స్థానాన్ని నిల‌బెట్టుకోలేక పోవ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది ఆర్జేడీ చీఫ్ తేజ‌స్వి యాద‌వ్ కు. గోపాల్ గంజ్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న భార్య కుసుమ్ దేవి పార్టీ అభ్య‌ర్థ‌ఙ‌గా(Gopalgunj By Poll BJP Win) పోటీ చేసారు . ఆమె ఆర్జేడీకి చెందిన మోహ‌న్ గుప్తాను ఓడించారు.

తేజ‌స్వి యాద‌వ్ తండ్రి , మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సొంత జిల్లా గోపాల్ గంజ్. ఇక్క‌డ ఆర్జేడీ పోటీని తీవ్రంగా తీసుకుంది. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్నారు. తేజ‌స్వి యాద‌వ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

విచిత్రం ఏమిటంటే ఇక్క‌డ ఎంఐఎం, బీఎస్పీకి చెందిన పార్టీలు ఓట్ల‌ను చీల్చ‌డం ఆర్జేడీ అభ్య‌ర్థి ఓడి పోయేందుకు దోహ‌ద ప‌డ్డాయి. ఎంఐఎం 12,000 ఓట్లు పొందితే బీఎస్పీ 9,000 ఓట్లు చేజిక్కించుకుంది.

Also Read : న‌న్ను దీదీ మా అని పిల‌వద్దు – ఉమా భార‌తి

Leave A Reply

Your Email Id will not be published!