Bhagat Singh Air Port : భగత్ సింగ్ ఎయిర్ పోర్ట్ గా పేరు మార్పు
షహీద్ గా మార్చుతూ కేంద్రం నోటిఫై
Bhagat Singh Air Port : దేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన యోధుడు షహీద్ సర్దార్ భగత్ సింగ్ కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది కేంద్ర సర్కార్. ఈ మేరకు చండీగఢ్ ఎయిర్ పోర్టు పేరు మారుస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా(Bhagat Singh Air Port) పిలుస్తారు. దీనిని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తున్నట్లు తెలిపారు.
స్వాతంత్ర సమర యోధుడికి నివాళిగా చండీగఢ్ ఎయిర్ పోర్టుకు భగత్ సింగ్ పేరు మార్చనున్నట్లు గత సెప్టెంబర్ 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 28న స్వాతంత్ర సమరయోధుడి 115 వ జయంతి వేడుకలు నిర్వహించగా అదే రోజు చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరును చేర్చినట్లు తెలిపింది. నవంబర్ 2న జారీ చేసిన నోటిఫికేషన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.
విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, పేరు మార్చడంలో విస్తృతమైన ప్రక్రియను విస్తృతం చేసింది. రాష్ట్రం నుంచే కాకుండా కేంద్ర మంత్రివర్గం నుండి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎయిర్ పోర్టు లను ఉన్న నగరం పేరుతో పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట పేరును ప్రతిపాదించింది.
సంబంధిత రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన తీర్మానం ద్వారా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంటుంది.
Also Read : గోపాల్ గంజ్ లో ‘కమల’ వికాసం