KTR : కోట్లు కుమ్మ‌రించినా ఓట‌మి తప్ప‌లేదు – కేటీఆర్

అహంకారం..ధ‌న‌మ‌దంపై మునుగోడు దెబ్బ‌

KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆదివారం జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఘ‌న విజ‌యాన్ని సాధించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అహంకారానికి , ధ‌న మదానికి కోలుకోలేని రీతిలో మునుగోడు ప్ర‌జ‌లు అదును చూసి దెబ్బ కొట్టారంటూ కితాబు ఇచ్చారు. కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయ‌ని, ఆధారాల‌తో స‌హా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు కేటీఆర్.

15 సీఆర్పీఎఫ్ కంపెనీల‌ను దించారు. 40 ఐటీ టీంలను దించిన మాట వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. తాము డ‌బ్బులు పంచ‌లేద‌ని కానీ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డింది బీజేపీనేన‌ని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ అధ్య‌క్షుడు అనుచ‌రుడు వేణు, ఈట‌ల రాజేంద‌ర్ కు చెందిన క‌డారి శ్రీ‌నివాస్ వ‌ద్ద డ‌బ్బులు ప‌ట్టుకున్న‌ది ఈ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా అని నిల‌దీశారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఎన్నో ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. కానీ హుజూరాబాద్ , మునుగోడులోనే వంద‌ల కోట్ల రూపాయ‌లు చెలామాణి అయ్యింద‌న్నారు. అక్క‌డ పోటీ చేసిన ఈటల రాజేంద‌ర్ , ఇక్క‌డ పోటీ చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిలు ధ‌న‌వంతులు కాదా అన్నారు.

ఈ ఇద్ద‌రు ధ‌న‌వంతుల‌కు కోట్లు పంపింది కేంద్ర ప్ర‌భుత్వం కాదా అని మండిప‌డ్డారు. తాము ఏమైనా అడ్డ‌దారులు తొక్కి ఉంటే ఇలాంటి విజ‌యం ద‌క్కేదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యాన్ని తుంగ‌లో తొక్కాల‌ని చూసినా చివ‌ర‌కు ఇలాంటి ఫ‌లితాలు రాబోయే రోజుల్లో వ‌స్తాయ‌ని తెలుసు కోవాల‌న్నారు.

Also Read : మునుగోడులో కారు జోరు బీజేపీ బేజారు

Leave A Reply

Your Email Id will not be published!