Bandi Sanjay : ప్రజా తీర్పును గౌరవిస్తాం – బండి సంజయ్
ఎన్నికల కురుక్షేత్రంలో నైతిక విజయం మాదే
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడి పోవడంపై స్పందించారు. ఆదివారం బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్.
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. గెలిచిన వెంటనే అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను 15 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్(Bandi Sanjay).
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి ఒక్క బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు బండి సంజయ్ . రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు.
టీఆర్ఎస్ విజయం సాధించడంలో పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇతోధికంగా సహాయ సహకారాలు అందించిందని ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఓడి పోయినా.. గెలిచినా ప్రజల కోసమే పోరాటం చేస్తామని ప్రకటించారు.
18 మంది మంత్రులు 86 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో పాటు రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగమంతా మునుగోడులో తిష్ట వేసిందన్నారు.
కోట్లు పంపిణీ చేసింది మీరు కాదా అని టీఆర్ఎస్ ను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని లేక పోతే ఆందోళన చేస్తామన్నారు బండి సంజయ్.
Also Read : కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు – కేటీఆర్