Palvai Sravanthi Reddy : ఒంట‌రి పోరాటానికి ద‌క్క‌ని డిపాజిట్

పాల్వాయి స్ర‌వంతి రెడ్డి ప్ర‌య‌త్నం భేష్

Palvai Sravanthi Reddy : మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి చెందింది. కానీ ఆ పార్టీ త‌న సీటును ద‌క్కించు కోలేక పోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క‌డే తానై వ్య‌వ‌హ‌రించడం, సీనియ‌ర్లు దూరంగా ఉండ‌డం పెద్ద దెబ్బ ప‌డింది.

అయినా పార్టీ అభ్య‌ర్థిగా దివంగ‌త సీనియ‌ర్ నాయ‌కుడు పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డికి ఉన్న ఇమేజ్ చాలా వ‌ర‌కు పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న పాల్వాయి స్ర‌వంతి రెడ్డి (Palvai Sravanthi Reddy)  ఓట్ల‌ను రాబ‌ట్ట గ‌లిగింది. పార్టీ ప‌రంగా స‌రైన స‌హ‌కారం ల‌భించ లేద‌న్న‌ది వాస్త‌వం.

కానీ ఆడ‌బిడ్డ అయినా ఒంట‌రి పోరాటం చేసింది. చివ‌రి నిమిషం దాకా పోరాడింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ధ‌న దాహం ముందు స్ర‌వంతి రెడ్డి నిలువ‌లేక పోయింది. కేవ‌లం పార్టీ కంటే తండ్రి మీద ఉన్న ఉన్న అభిమానంతో పాటు సంప్ర‌దాయ ఓట్లు మాత్ర‌మే స్ర‌వంతికి ప‌డ్డాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక ర‌కంగా డిపాజిట్ రాక పోయినా పాల్వాయి స్ర‌వంతి రెడ్డి ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకున్నారు. సీనియ‌ర్ల స‌హ‌కారం లేక పోయినా, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సోద‌రుడి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినా త‌ను ఒంట‌రి పోరాటం చేసింది. పార్టీని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఇందుకు ఆమెను అభినందించాల్సిందే.

గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆశించినంత మేర ఓట్ల‌ను రాబ‌ట్ట‌లేక పోయింది. క్ర‌మ క్ర‌మంగా బీజేపీ బ‌ల‌ప‌డ‌డం ఒకింత ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. 2,41,805 ఓట‌ర్ల‌కు గాను 2,25,192 ఓట్లు పోల్ అయ్యాయి.

హ‌స్తం అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి రెడ్డికి 23,906 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. డిపాజిట్ రావాలంటే క‌నీసం మొత్తం పోల్ అయిన ఓట్ల‌లో 6వ వంతు ఓట్లు సాధించాల్సి ఉంది. దాదాపు 38 వేల ఓట్లు సాధించాల్సి ఉంది.

మొత్తంగా స్ర‌వంతి రెడ్డిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ పార్టీ పున‌రాలోచించు కోవాలి. లేదంటే పార్టీ భ‌విష్య‌త్తు ప్ర‌మాదం ఏర్ప‌డ‌నుంద‌ని గ‌మ‌నించాలి.

Also Read : ఆ మంత్రుల‌కు ఓట‌ర్లు ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!