ED IT Raids : తెలంగాణలో ఈడీ..ఐటీ దాడుల కలకలం
30 ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు
ED IT Raids : మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఆ వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖల ఆధ్వర్యంలో తెలంగాణలో పలు చోట్ల దాడులకు దిగాయి(ED IT Raids) . హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గనుల అక్రమాలపై సంయుక్త ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
మొత్తం 30 ప్రాంతాలలో ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గతంలో కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ కంపెనీల ఆధ్వర్యంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు కూడా అందాయి. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది.
విచిత్రం ఏమిటంటే ఈడీ, ఐటీ అధికారులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా వెంట రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ దాడుల, సోదాల వ్యవహారం. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దాని మూలాలు తెలంగాణలో ఉండడం విస్తు పోయేలా చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో గ్రానైట్ వ్యాపారానికి కరీనంగర్ జిల్లాకు మంచి పేరుంది.
ఇక్కడి నుంచి వెళ్లే రాళ్లకు ఎనలేని డిమాండ్ ఉంటోంది. గ్రానైట్ వ్యవహారం, దందాపై బీజేపీ చీఫ్ బండి సంజయ్, న్యాయవాది ఒకరు ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వరుస సోదాలు చేపట్టింది.
పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహేంద్రు, బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దాడులు పూర్తయ్యాక కేంద్ర దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేత