Raja Singh MLA : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్
షరతులతో కూడిన మంజూరు
Raja Singh MLA : ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్(Raja Singh MLA) కు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. విద్వేష పూరిత కామెంట్స్ చేశారంటూ రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఆయనపై పీడీ యాక్టు నమోదు చేయడం కలకలం రేపింది.
దేశంలో మొదటిసారిగా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన శాసనసభ్యుడిపై పీడీ చట్టం నమోదు చేయడం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ విధించిన సస్పెన్షన్ ను కూడా ఎత్తి వేసింది. బుధవారం రాజా సింగ్ కు బెయిల్ మంజూరు కావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత సెప్టెంబర్ 2న రాజా సింగ్(Raja Singh MLA) ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం మూడు రోజులకే సెప్టెంబర్ 5న తెలంగాణ పోలీసులు పీడీ చట్టాన్ని నమోదు చేశారు. వెంటనే భారీ భద్రత నడుమ రాజా సింగ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.
ఆనాటి నుంచి నేటి దాకా అంటే దాదాపు 2 నెలలకు పైగా బీజేపీ ఎమ్మెల్యే జైలు లోనే గడిపారు. ఇదే సమయంలో రాజాసింగ్ కు అన్యాయం జరిగిందని వెంటనే అతడిపై సస్పెన్షన్ వేటు తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
ప్రధానంగా ఆయనపై చర్యలు తీసుకుంటే హిందూత్వ క్యాడర్ నిరాశకు గురవుతుందని, అంతకంటే ఎక్కువగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఆ పార్టీకి చెందిన నేతలు, అనుచరులు స్పష్టం చేశారు. చివరకు పార్టీ రాజా సింగ్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇవాళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Also Read : తెలంగాణలో ఈడీ..ఐటీ దాడుల కలకలం