Jharkhand CM : భారీ సంస్కరణలకు సోరేన్ శ్రీకారం
కేంద్రంపై పోరాటానికి సీఎం సిద్దం
Jharkhand CM : అక్రమ మైనింగ్ లీజు వ్యవహారం కేసులో తీవ్ర ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు బీజేపీ దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేశారు. తనకు ఈడీ సమన్లు మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
దేశ వ్యాప్తంగా బీజేపీయేతర రాష్ట్రాలలో సీఎంలు వర్సెస్ గవర్నర్ల మధ్య యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో అసెంబ్లీలో సున్నితమైన, రాజకీయ ప్రాధాన్యత కలిగిన చట్టాలను తొలగించడమో లేదా మార్పు చేయడమో చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న చాలా చట్టాలపై ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం కూడా లేనట్టు ప్రభుత్వం భావిస్తోంది.
మరో వైపు కేంద్రం కూడా ఎలాగైనా హేమంత్ సోరేన్ ను(Jharkhand CM) ఇరికించి జైలుకు పంపించాలని యోచిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ఫుల్ పవర్స్ ఇచ్చి దూకుడు పెంచేందుకు ఆదేశించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు తెలంగాణ సర్కార్ కూడా ఇదే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించింది. ముందస్తుగా తమ రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా ఆదేశించింది.
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక 2019లో రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలపై ఫోకస్ పెట్టారు సీఎం హేమంత్ సోరేన్(Jharkhand CM). శుక్రవారం ప్రత్యేక సెషన్ లో జార్ఖండ్ అసెంబ్లీ రెండు ల్యాండ్ మార్క్ బిల్లులను క్లియర్ చేస్తుందని భావిస్తున్నారు.
ఇందులో ఒకటి 1932 నుండి భూమి రికార్డులను ఉపయోగించి స్థానికులను గుర్తించడం. రెండు ఇతర వెనుకబడిన తరగతులు లేదా ఓబీసీలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను 14 నుండి 27 శాతానికి పెంచడం.
Also Read : మోదీ పాలనలో అనకొండలా అవినీతి – హజారే