Rajiv Gandhi Killers : న‌ళినితో స‌హా ఆరుగురు విడుద‌ల – సుప్రీం

గాంధీ హంత‌కుల రిలీజ్ కు స‌మ్మ‌తి

Rajiv Gandhi Killers : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన దివంగ‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ దారుణ హ‌త్య కేసులో(Rajiv Gandhi Killers) కీల‌క సూత్ర‌ధారులుగా ఉంటూ జీవిత ఖైదు అనుభ‌విస్తున్న న‌ళిని శ్రీ‌హ‌ర‌న్ తో పాటు మ‌రో ఆరుగురికి ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది.

ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ హంత‌కుల‌ను విడుద‌ల చేసింది. వీరిని విడుద‌ల చేసేందుకు గాను త‌మిళ‌నాడు డీఎంకే ప్ర‌భుత్వం గ‌తంలోనే గ‌వ‌ర్న‌ర్ కు సిఫార‌సు చేసింది. వారిని విడుద‌ల చేస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో న‌ళినీ శ్రీ‌హ‌ర‌న్ ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది ధ‌ర్మాస‌నం.

జీవిత ఖైదు అనుభ‌విస్తున్న న‌ళినీతో పాటు మ‌రో ఐదుగురు దోషుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దివంగ‌త రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో కీల‌కంగా ఉన్న జీవిత ఖైదుకు గురైన పెరారివాల‌న్ ను గ‌త మే నెల‌లో అత్యున్న‌త న్యాయ స్థానం విడుద‌ల చేసింది.

న‌ళినీ శ్రీ‌హ‌ర‌న్ తో పాటు 1991లో మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో జైలు శిక్ష అనుభ‌వించిన వారిలో శ్రీ‌హ‌ర‌న్ , సంత‌న్ , మురుగ‌న్ , రాబ‌ర్ట్ ప‌య‌స్ , ర‌విచంద్ర‌న్ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా రాజీవ్ గాంధీ మే 21, 1991లో త‌మిళ‌నాడు రాష్ట్రంలోని శ్రీ పెరంబుదూర్ వ‌ద్ద త‌మిళ టైగ‌ర్స్ ఎల్టీటీ గ్రూప్ న‌కు చెందిన మ‌హిళా ఆత్మాహుతి బాంబ‌ర్ చేతిలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

వీరిని విడుద‌ల చేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్.

Also Read : గ‌వ‌ర్న‌ర్ కు ప‌ని త‌క్కువ పాలిటిక్స్ ఎక్కువ‌

Leave A Reply

Your Email Id will not be published!