ED Raids Granite Case : గ్రానైట్ దందాలో హవాలా నిజం – ఈడీ
రూ. 1.08 లక్షల నగదు సీజ్ చేశాం
ED Raids Granite Case : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ప్రకటన చేసింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖతో కలిసి విస్తృతంగా దాడులు చేపట్టింది. ప్రత్యేకించి ఇప్పటికే అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ రంగంలోకి దిగింది. నవంబర్ 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది.
హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ సంస్థలు, ఆఫీసులు , ఇళ్లపై సోదాలు చేసింది. విచిత్రం ఏమిటంటే రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు, ఐటీకి సమాచారం ఇవ్వలేదు ఈడీ, ఐటీ. ఇదే క్రమంలో వీరి వెంట పెద్ద ఎత్తున కేంద్రానికి చెందిన బలగాలు సీఆర్పీఎఫ్ సిబ్బంది 30 మందికి పైగా ఉండడం విస్తు పోయేలా చేసింది.
ప్రధానంగా టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ సాగాయి దాడులు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎంపీ కి చెందిన ఆఫీసులు, ఇళ్లను జల్లెడ పట్టాయి. దాడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీలో దాడులపై ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది.
రెండు రోజులలో జరిపిన దాడుల్లో రూ. 1 కోటి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. చైనా, హాంకాంగ్ , సింగపూర్ తో పాటు మరికొన్ని దేశాలకు అక్రమంగా గ్రానైట్ ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది ఈడీ(ED Raids Granite Case).
ఇందులో భాగంగా ఎగుమతి పన్నులకు ఎగనామం పెట్టారని, అడ్డ దారిలో డబ్బులు పొందినట్లు ఆధారాలు సేకరించినట్లు కుండ బద్దలు కొట్టింది. హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపించింది.
Also Read : తెలంగాణకు రానున్న పీఎం మోదీ