Sanjay Raut : ‘రాహుల్..ఠాక్రే’ దేశాన్ని పాలించే సమర్థులు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్స్
Sanjay Raut : శివసేన (ఉద్దవ్) పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాన్ని పాలించే సత్తా ఇద్దరికే ఉందన్నారు. వారిలో ఒకరు రాహుల్ గాంధీ మరొకరు ఆదిత్యా ఠాక్రే అని పేర్కొన్నారు. శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు.
ఈ దేశం యువ నాయకత్వం వైపు చూస్తోందన్నారు. దేశాన్ని నడిపించే శక్తి సత్తా ఆ ఇద్దరికి మాత్రమే ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఒకరు రాష్ట్రాన్ని, మరొకరు దేశాన్ని నడిపిస్తే తాను చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు సంజయ్ రౌత్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వమైన ఆదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు.
పార్టీలు వేరైనా తమ లక్ష్యం ఒక్కటేనని స్పష్టం చేశారు. జోడో యాత్రలో శివసేన కూడా కీలకమైన భాగం పంచుకుందని తెలిపారు. వాళ్లిద్దరూ కలిసి నడుస్తున్నారని ఇది ఆహ్వానించ దగిన పరిణామమని పేర్కొన్నారు. సంజయ్ రౌత్(Sanjay Raut) ఇటీవలే మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పై విడుదల అయ్యారు.
ఆయన గతంలో లాగా ఎవరినీ నిందించ లేదు. రాష్ట్రం, దేశం కోసం పని చేసే శక్తి ఆ యువ నాయకులకు ఉందన్నారు. ఉద్దవ్ ఠాక్రే, వంచిత్ బహుజన్ అఘాడీ నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ ల కలయిక గురించి అడిగిన ప్రశ్నకు పై విధంగా జవాబు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటికీ తరతరాలుగా విస్తరించి ఉందన్నారు.
ఇదిలా ఉండగా సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Also Read : మోదీ స్టేడియం పేరు మారుస్తాం – కాంగ్రెస్