PM Modi : డిసెంబ‌ర్ 1 నుండి జీ20 చీఫ్ గా భార‌త్

సాధించిన విజ‌యాలు ప్ర‌చారం చేస్తా

PM Modi : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi)  కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త దేశం సాధించిన అపూర్వ‌మైన విజ‌యాల‌ను ప్ర‌పంచానికి ప‌రిచయం చేసే అవ‌కాశం రానుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 1 నుండి భార‌త దేశం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జీ20 కి నాయ‌క‌త్వం వ‌హించ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను స‌మిష్టిగా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తుంద‌న్నారు. అచంచ‌ల‌మైన నిబద్ద‌త గురించి కూడా తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి.

ఈ కీల‌క‌మైన ప‌ద‌వి గురించే ప్ర‌త్యేకంగా మోదీ ప్ర‌స్తావించ‌డం విశేషం. ప్ర‌పంచ వృద్దిని పున‌రుద్ద‌రించ‌డం, ఆహారం, ఇంధ‌న భ‌ద్ర‌త‌కు భ‌రోసా , డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌న‌కు సంబంధించిన కీల‌క స‌వాళ్ల‌పై ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఇండోనేషియాలో ఈనెల 15 నుంచి 16 వ‌ర‌కు జ‌రిగే కీల‌క‌మైన స‌ద‌స్సులో ప్ర‌స్తావిస్తాన‌ని చెప్పారు. మ‌రో వైపు బ్రిట‌న్ పీఎం రిషి సున‌క్ , ఫ్రాన్స్ చీఫ్ ఇమ్మాన్యుయేల్ తో భేటీ కానున్నాన‌ని వెల్ల‌డించారు మోదీ(PM Modi) . ఈ స‌ద‌స్సు ఇండోనేషియాలోని బాలిలో జ‌ర‌గ‌నుంది.

ఇందులో ర‌ష్యా, ఉక్రెయిన్ వివాదం కూడా ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు రానుంద‌న్నారు. ఎక్కువ‌గా ఆహార కొర‌త‌, ఇంధ‌న భ‌ద్ర‌త ముఖ్యంగా ప్ర‌స్తావించేందుకు వీలుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఇక భార‌త స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రాగ‌న్ చైనా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఈ త‌రుణంలో చైనా చీఫ్ జిన్ పింగ్ , అమెరికా చీఫ్ బైడెన్ , బ్రిట‌న్ పీఎం రిషి సున‌క్ , ప్రాన్ చీఫ్ మాక్రాన్ , త‌దిత‌ర బ‌డా నేత‌లు హాజ‌ర‌వుతున్నారు. దీంతో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : రిషి సున‌క్ తో భేటీ కానున్న మోదీ

Leave A Reply

Your Email Id will not be published!