Elon Musk Fire : ట్విట్ట‌ర్ లో ఫుడ్ కోసం 13 మిలియ‌న్ల ఖ‌ర్చు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన బాస్ ఎలాన్ మ‌స్క్

Elon Musk Fire : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మస్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఇటీవ‌లే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ విస్తు పోయేలా చేస్తున్నారు. ప్ర‌ధానంగా 3,978 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపించారు. ఆపై ఇక నుంచి ఎవ‌రైనా స‌రే ఆఫీసుకు రావాల్సిందేనంటూ ఆదేశించారు.

అంతే కాదు ఎవ‌రికీ ఆఫీసులో ఉచితంగా ఫుడ్, ఇత‌ర సౌక‌ర్యాలు అంటూ ఉండ‌వ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. వైఫై కూడా ఇవ్వ‌నంటూ పేర్కొని కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌తి ఏడాదికి $13 మిలియ‌న్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఇలాగైతే సంస్థ ఎలా బాగు ప‌డుతుంద‌ని ప్ర‌శ్నించారు ఎలాన్ మ‌స్క్(Elon Musk Fire).

ట్విట్ట‌ర్ ప్ర‌ధాన కార్యాల‌యం అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంది. ఇదిలా ఉండ‌గా మ‌స్క్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వ‌ర్క్ ట్రాన్స్ ఫార్మేష‌న్ ట్రేసీ హాకిన్స్ తో విభేదించాడు. ఇక ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్న రెండు వారాల త‌ర్వాత కంపెనీలో నాట‌కీయ ప‌రిణామాల‌కు సంబంధించిన వివాదాలు, వైరుధ్యాల‌కు కేరాఫ్ గా మారింది.

ఆదివారం ట్రేసీ హాకిన్స్ , ఎలాన్ మ‌స్క్ మ‌ధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. హాకిన్స్ ఒక వారం కింద‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్ లో ఫుడ్ ప్రోగ్రామ్ న‌డిపారు. ట్విట్ట‌ర్ ఒక వ్య‌క్తికి రోజుకు 20 నుంచి 25 డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు పేర్కొంది. గ‌త 12 నెల‌ల్లో ఎవ‌రూ ఆఫీసుకు రాలేద‌ని ఈ స‌మ‌యంలో ఇంత ఖ‌ర్చు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు ఎలాన్ మ‌స్క్.

అల్పాహారం తిన‌డం కంటే వాటిని తయారు చేసే వారు ఎక్కువ‌గా ఉన్నారంటూ మండిప‌డ్డారు బాస్.

Also Read : ట్విట్ట‌ర్ బ్లూ టిక్ పై మ‌స్క్ క్లారిటీ

Leave A Reply

Your Email Id will not be published!