Lay Offs Effect : సింగ‌పూర్ పై ఫేస్ బుక్ లే ఆఫ్స్ ఎఫెక్ట్

ప‌లువురు భార‌తీయ టెక్కీల‌కు బిగ్ షాక్

Lay Offs Effect : ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతోంది. ప్ర‌ధానంగా ఐటీ సెక్టార్ ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాక 3,978 మందిని తొల‌గించాడు. ఆ వెంట‌నే సోష‌ల్ మీడియా దిగ్గ‌జ కంపెనీ ఫేస్ బుక్ 11,000 మందిని సాగ‌నింపింది.

ఇందులో ఎక్కువ‌గా ప్ర‌వాస భార‌తీయులే ఉన్నారు. అన్ని రంగాల‌లో మ‌న వాళ్లు టాప్ లో కొన‌సాగుతున్నారు. ఈ ఆర్థిక రంగ ప్ర‌భావం దెబ్బ‌కు చాలా మంది టెక్కీలు నానా తంటాలు ప‌డుతున్నారు. దీని ఎఫెక్ట్ సింగ‌పూర్ పై కూడా ప‌డింది. ఇక్క‌డ కూడా ఎన్నారైలు ప‌ని చేస్తున్నారు.

సింగ‌పూర్ లోని సాంకేతిక సంస్థ‌లు మెల మెల్ల‌గా ఉద్యోగుల‌ను త‌గ్గిస్తూ(Lay Offs Effect) వ‌స్తున్నాయి. దీనికి వినియోగదారుల వ్య‌యం, అధిక వ‌డ్డీ రేట్లు, ద్ర‌వ్యోల్బ‌ణం నేప‌థ్యంలో నియామ‌కాల‌కు చెక్ పెట్టింది. కొత్త వారిని తీసుకోక పోగా ఉన్న వారిని తీసివేసే ప‌నిలో ప‌డ్డాయి.

ఇక సింగ‌పూర్ లోని 1,77,100 మంది ఎంప్లాయిస్ ఉన్న‌ట్లు గుర్తించ‌గా వారిలో నాలుగింట ఒక వంతు మంది భార‌త దేశానికి చెందిన వారు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక సింగ‌పూర్ లో ఉన్న ఫేస్ బుక్ లో 1,000 మంది ఉంటే వారిలో 100 మందికి పైగా భార‌తీయ ఉద్యోగుల‌ను తీసి వేసిన‌ట్లు స‌మాచారం.

వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు, టెక్ కార్మికులు ఉండ‌డం విశేషం. 45 వేల మందికి పైగా మ‌న వాళ్లు ఉన్నారు. వివిధ రంగాల‌లో జాబ్స్ చేస్తున్నారు. సింగ‌పూర్ కు చెందిన గేమింగ్, ఇకామ‌ర్స్ ప‌వ‌ర్ హౌస్ సీ లిమిటెడ్ షాపీ లో ఉద్యోగుల‌ను తొల‌గించింది. దీని బాట‌లోనే మ‌రికొన్ని కంపెనీలు ఉన్నాయి.

Also Read : డిసెంబ‌ర్ 1 నుండి జీ20 చీఫ్ గా భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!