Elon Musk Busy : రెస్ట్ లేకుండా పని చేస్తున్నా – ఎలాన్ మస్క్
ప్లేట్ నిండా ఆహారం కంటే పని ఎక్కువగా ఉంది
Elon Musk Busy : టెస్లా సిఇఓ, చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లా, స్పేస్ ఎక్స్ తో కొంత సమయం ఉండేదని కానీ ప్రస్తుతం ట్విట్టర్ కొనుగోలు చేశాక తనకు రెస్ట్ లేకుండా పోయిందని(Elon Musk Busy) పేర్కొన్నారు. ఒక సంస్థను గట్టెక్కించాలంటే ఈ మాత్రం పని ఉంటుందన్నాడు.
ఇదే సమయంలో తన ప్లేట్ లో ఆహారానికి బదులు అంతకన్నా ఎక్కువగా పని ఉంటోందని వాపోయాడు. చాలా మంది తనకు లెక్కించ లేనంత డబ్బులు ఉన్నాయని అనుకుంటారని అందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు. కానీ ఎంత సంపాదించినా కాస్తంత విశ్రాంతి కూడా అవసరమేనని గుర్తించాలని సూచించాడు ఎలాన్ మస్క్.
పక్కా బిజినెస్ మెన్ గా తనను తాను ప్రకటించుకునే ఈ బిలియనీర్ ఏది ట్వీట్ చేసిన అది సంచలనమే. ఇప్పటికే ట్విట్టర్ లో 7,500 మంది ఉంటే 3,978 మందిని తొలగించాడు. సోమవారం మరో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. కాంట్రాక్టు కింద పని చేస్తున్న మరో 50,000 మందిని తీసి వేస్తున్నట్లు ప్రకటించాడు.
ఇవన్నీ సంస్కరణల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలని తెలిపాడు. చాలా మందికి తాను ఓ విలన్ గా కనిపిస్తానని కానీ పని చేసే వాళ్లకు తాను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తానని స్పష్టం చేశాడు ఎలాన్ మస్క్. ఇదిలా ఉండగా నవంబర్ 15, 16 తేదీల్లో ఇండోనేషియా లోని బాలిలో అంతర్జాతీయ శిఖరాగ్ర జి20 సదస్సు జరుగుతోంది.
బ్యాటరీ పెట్టుబడిపై టెస్లాతో ఒప్పందం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది అక్కడి సర్కార్. ఈ సందర్భంగా టెస్లా సిఇఓ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : గూగుల్ డూడల్ విన్నర్ శ్లోక్ ముఖర్జీ